మహేష్ బాబు సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ

September 7, 2021 0 Comments


త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కామన్. అయితే మెయిన్ హీరోయిన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, సెకెండ్ హీరోయిన్ కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే ఈ దర్శకుడి సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పొజిషన్ లో కూడా క్రేజీ ముద్దుగుమ్మలు కనిపిస్తారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ.. తన నెక్ట్స్ మూవీలో కూడా క్రేజీ హీరోయిన్ నే సెకెండ్ లీడ్ గా తీసుకోబోతున్నాడు త్రివిక్రమ్.

త్వరలోనే మహేష్ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. హీరోయిన్ గా పూజా హెగ్డేను లాక్ చేశారు. ఈ విషయాన్ని ఈమధ్య అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు సంప్రదింపులు మొదలైనట్టు తెలుస్తోంది.

సుధీర్ బాబు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ సినిమా సక్సెస్ ను ఆమె క్యాష్ చేసుకోలేకపోయింది. సినిమాలైతే చేస్తోంది కానీ, పేరు అంతంతమాత్రమే. సో.. ఇలాంటి టైమ్ లో వచ్చిన త్రివిక్రమ్ అవకాశాన్ని ఆమె ఎంతమాత్రం వదులుకోదు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రాబోతోంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *