టైమ్ చూసి దెబ్బ కొట్టిన బండ్ల గణేష్

September 5, 2021 0 Comments


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రస్తుతానికైతే ఎడ్జ్ ఎక్కువగా ప్రకాష్ రాజ్ వైపే ఉంది. ప్యానెల్ బలంగా ఉంది. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంది. పరిస్థితులన్నీ ఆశాజనకంగా ఉన్నాయి. ఇలా ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైమ్ లో ప్రకాష్ రాజ్ కు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా మెగా కాంపౌండ్ వీరవిధేయుడు బండ్ల గణేష్ నుంచి కావడం విశేషం.

అవును.. ప్రకాష్ రాజ్ మద్దతుదారుల నుంచి బండ్ల గణేశ్ తప్పుకున్నాడు. కేవలం తప్పుకోవడమే కాదు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు వ్యతిరేకంగా పోటీ కూడా చేయబోతున్నాడు. దీనికి కారణం జీవిత రాజశేఖర్.

ఊహించని విధంగా జీవిత రాజశేఖర్ పేరును తన ప్యానెల్ లో ప్రకటించాడు ప్రకాష్ రాజ్. ఆమెను జనరల్ సెక్రటరీగా బరిలో దించాడు. సరిగ్గా ఇక్కడే బండ్ల గణేశ్ కు కోపమొచ్చింది. గతంలో ఎన్నోసార్లు మెగా కాంపౌండ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జీవితను ప్యానెల్ లోకి తీసుకోవడం బండ్లకు నచ్చలేదు. అందుకే వెంటనే బయటకొచ్చేశాడు. తిరిగి జీవిత పైనే జనరల్ సెక్రటరీ పోస్టుకు పోటీ చేయబోతున్నాడు.

నిజానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జీవిత రాజశేఖర్ పేరు కొత్తగా వచ్చి చేరింది కాదు. 2 నెలల కిందట ప్రెస్ మీట్ పెట్టినప్పుడే జీవిత మద్దతు ఈ ప్యానెల్ కు ఉంది. అప్పుడు బండ్ల గణేశ్ కు లేని అభ్యంతరం, సరిగ్గా ఎన్నికలకు ముందు ఎందుకొచ్చిందనేది చాలామంది ప్రశ్న. మా ఎన్నికల ప్రహసనంలో కొత్తగా మొదలైన ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *