మొన్న భూమిక.. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్

June 8, 2021 0 Comments


హీరోయిన్లు-పుకార్లు ఓ ప్యాకేజీలా వస్తారు. రెండింటినీ విడదీసి చూడలేం. హీరోయిన్ ఎక్కడుంటే పుకారు
అక్కడుంటుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ పై పుకార్లు చెలరేగాయి. ఈసారి ఈ పుకార్లకు పాయల్ తో
పాటు, నటి భూమికకు లింక్ ఉండడం విశేషం. ఇంతకీ అవేంటో చూద్దాం.

హిందీలో బిగ్ బాస్ సీజన్-15 కోసం సెలక్షన్లు జరుగుతున్నాయి. సెలబ్రిటీలో కోసం వెదుకుతున్నారు.
ఇందులో భాగంగా భూమికను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. ఆ వెంటనే భూమిక స్పందించింది. తనను
ఎవ్వరూ సంప్రదించలేదని, ఒకవేళ తనను సంప్రదించినా ఒప్పుకోనని కరాఖండింగా చెప్పేసింది.

ఆ వెంటనే పుకార్లు భూమిక నుంచి పాయల్ రాజ్ పుత్ కు షిఫ్ట్ అయ్యాయి. హిందీ బిగ్ బాస్ సీజన్-15లోకి
పాయల్ ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే
వీటిపై పాయల్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *