కరోనా కాలంలో కుల రాజకీయాలేంటి బాబూ.. – విజయసాయి సెటైర్లు..

June 6, 2021 0 Comments


రాష్ట్రాన్ని కులాలవారీగా, మతాల వారీగా, ప్రాంతాలవారీగా విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసిన చంద్రబాబుని ప్రతి వర్గం ప్రజలు తిరస్కరించారని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కరోనా కష్టకాలంలో కూడా కులరాజకీయాలు చేయాలని చూసేది కేవలం చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్ మాత్రమేనని దెప్పిపొడిచారు.

చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ పై విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డారని పరోక్షంగా గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. “బాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో వాతలు తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఎవరో ఉసిగొల్పితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్లు హూనం చేసుకున్నామని పశ్చాతాప పడతారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోతుంది.” అని ట్వీట్ చేశారు.

దొంగ చూపు-దొంగ దెబ్బ
జగన్ ది ముందుచూపు అని, చంద్రబాబుది దొంగచూపు అని విమర్శించారు విజయసాయిరెడ్డి. “ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలని సీఎం జగన్ ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీది ఎప్పుడూ ‘దొంగ’ చూపే. లిటిగేషన్లతో ప్రభుత్వాన్ని దొంగ దెబ్బ కొట్టాలని చూస్తుంటాడు. లిటిగెన్సీని నమ్ముకుని ఎవరూ బాగుపడ లేదని చరిత్ర చెబుతోంది.” అంటూ మండిపడ్డారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *