చిరంజీవి సర్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు

June 4, 2021 0 Comments


ఈరోజు సన్నాఫ్ ఇండియా రిలీజైంది. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ లో మోహన్ బాబు
ఎప్పీరయెన్స్ కంటే ఆశ్చర్యపరిచిన అంశం చిరంజీవి వాయిస్ ఓవర్. అవును.. సన్నాఫ్ ఇండియా టీజర్
కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. దీనికి సంబంధించి మోహన్ బాబు తన మనసులో మాటను
బయటపెట్టారు.

“SON OF INDIA చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. విష్ణు వెంటనే చిరంజీవి
అంకుల్ వాయిస్ బావుంటుందన్నాడు. చిరంజీవికి ఫోన్ చేస్తే ఎన్ని రోజుల్లో కావాలి బాబు అన్నాడు. పది
రోజుల్లో ఎప్పుడైనా ఓకే అన్నాను.. ఆ వాయిస్ ఓవర్ మ్యాటర్ నాకు పంపు అన్నాడు.. పంపాను. ఆచార్య
షూటింగ్ బిజీలో ఉంటూ, డబ్బింగ్ థియేటర్ బుక్ చేసి తనే డబ్బింగ్ చెప్పి పంపాలనుకున్నాడు. ఆ
మ్యాటర్ నాకు తెలిసింది. డబ్బింగ్ థియేటర్కి విష్ణుని పంపాను.. విష్ణుబాబు ని చూడగానే చిరంజీవి
నవ్వుతూ ఎవరు రమ్మన్నారు.. డబ్ చేసి మీ నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అన్నాడు. 3 రోజుల్లోనే
చేసి పంపించారు. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది. నేను అడగగానే ఇంత గొప్పగా స్పందించిన
చిరంజీని తీరుకి, అతని సహృదయతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..”

ఇలా చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓపెన్ లెటర్ విడుదల చేశారు మోహన్ బాబు. ఒకప్పుడు
సెలబ్రిటీ-లెజెండ్ వివాదంతో ఎడమొహం పెడమొహంగా ఉన్న చిరంజీవి-మోహన్ బాబు.. ఈమధ్య
కాలంలో మళ్లీ కలుసుకున్నారు. మీడియా సాక్షిగా కౌగిలించుకొని ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఆ
అనుబంధం అలా కొనసాగుతూనే ఉంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *