ఇవాళ్టి వైరల్ ఫొటో ఇదే | teluguglobal.in

May 31, 2021 0 Comments






ఒక ఫొటో ఈ రోజంతా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఒకే ఒక్క ఫొటో ఈరోజు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఆ ఒక్క ఫొటో ఈరోజు పవన్ కల్యాణ్ అభిమానులకు పండగ తీసుకొచ్చింది. అవును.. పవన్ కల్యాణ్ ఫొటో దిగాడు.

పవన్ కల్యాణ్ ఫొటోలు అభిమానులకు కొత్త కాదు. కానీ కొడుకు అకిరాతో పవన్ ఫొటో దిగితే ఎలా ఉంటుంది. అలాంటి సందర్భమే ఇది. పైన మీరు చూస్తున్న ఫొటో అదే. తండ్రికొడుకులు దిగిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

అకిరా ప్రస్తుతం సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడట. అందులో భాగంగా కొడుకును సంగీత పాఠశాల వరకు డ్రాప్ చేశాడట పవన్. ఆ సందర్భంలో మ్యూజిక్ టీచర్ తో కలిసి తండ్రికొడుకులు దిగిన ఈ ఫొటో అలా వైరల్ అయింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పవన్ కనిపించడం ఇదే తొలిసారి.






Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *