రామ్ చరణ్ మూవీపై క్లారిటీ | teluguglobal.in

May 21, 2021 0 Comments


ఆమధ్య రామ్ చరణ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ పై వార్తలొచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా
చేయబోతున్నారంటూ కథనాలొచ్చాయి. అది పుకారు మాత్రం కాదు. అందులో నిజం ఉంది. చరణ్ ను
మేర్లపాక కలిసిన మాట వాస్తవం. కథ వినిపించిన మాట కూడా వాస్తవం. కాకపోతే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.
కార్యరూపం దాల్చలేదు.

ఆ తర్వాత చరణ్-మేర్లపాక కాంబినేషన్ పై కథనాలు కూడా రావడం ఆగిపోయాయి. ఎట్టకేలకు ఈ టాపిక్
పై ఆ దర్శకుడు రియాక్ట్ అయ్యాడు. చరణ్ కు కథ వినిపించిన మాట నిజమేనని ఒప్పుకున్న మేర్లపాక..
కథ చరణ్ కు నచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే కథకు ఇంకా మరికొన్ని హంగులు కావాలని..
తర్వాత చూద్దామని చెప్పి చరణ్ పంపించాడట.

ఇప్పటికీ ఆ కథ అలానే ఉందని, ఎప్పటికైనా మంచి మార్పుచేర్పులు చేసి చరణ్ ను
కలుస్తానంటున్నాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా తన శిష్యుడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఏక్ మినీ కథ
అనే సినిమాను తీశాడు మేర్లపాక. వచ్చేవారం ఆ సినిమా అమెజాన్ లో రిలీజ్ అవ్వబోతోంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *