పుష్ప సినిమాకు కొత్త టైటిల్ | teluguglobal.in

May 18, 2021 0 Comments


అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా 2 భాగాలుగా రాబోతోందనే విషయం తెలిసిందే.
బాహుబలి-1, బాహుబలి-2 వచ్చినట్టుగానే.. పుష్ప-1, పుష్ప-2 వస్తుందని అంతా అనుకున్నారు. కానీ
అందరికంటే వెరైటీగా ఆలోచించే సుకుమార్.. ఇక్కడ కూడా తన మార్క్ చూపించబోతున్నాడు. పుష్ప
పార్ట్-2కు మరో టైటిల్ పెట్టబోతున్నాడు.

అవును.. పుష్ప సినిమా పార్ట్-1 అదే పేరుతో రిలీజ్ అవుతుంది. కానీ పార్ట్-2 మాత్రం మరో పేరుతో రిలీజ్
అవుతుంది. అది కూడా కథకు తగ్గట్టు మరో మాస్ టైటిల్ పెడుతూనే, సీక్వెల్ అనే అర్థం వచ్చేలా కూడా
పేరు పెట్టబోతున్నారు. ఈ మేరకు 2-3 టైటిల్స్ సుకుమార్ మదిలో ఉన్నాయి. కాకపోతే ఇప్పట్లో ఆ
టైటిల్ బయటకు రాదు.

పుష్ప సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయాలనే ఆలోచన సెట్స్ పైకి వెళ్లకముందు నుంచే ఉందట.
అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ ను 2 భాగాలుగా చేసుకున్నామనే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు
రీసెంట్ గా ప్రకటించారు. ఆఖరి నిమిషంలో బయటపెట్టాలనుకున్న ఆ మేటర్ రీసెంట్ గా లీక్
అవ్వడంతో, నిర్మాతలు కూడా ఓపెన్ అయిపోయారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *