హీరోగా మారబోతున్న బండ్ల | teluguglobal.in

April 28, 2021 0 Comments


బండ్ల గణేష్.. పరిచయం అక్కర్లేని పేరు. నిర్మాతగా కంటే కూడా, తన ప్రసంగాలతో పాపులర్ అయ్యారు ఈ ప్రొడ్యూసర్. ఇప్పుడీ నిర్మాత కమ్ నటుడు హీరోగా మారుతున్నాడు. అవును.. తమిళ్ లో సూపర్ హిట్టయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు బండ్ల. ఈ మేరకు రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు.

రీసెంట్ గా తమిళ్ లో మండేలా అనే సినిమా వచ్చింది. అందులో యోగిబాబు హీరో. సినిమా అంతా
సెటైరిక్ గా, సరదాగా ఉంటుంది. ఓ కమెడియన్ చేసిన ఈ సినిమాను స్టార్ హీరోలు సైతం
మెచ్చుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా గణేశ్ కు నచ్చింది.

ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకొని ఎవరైనా పెద్ద కమెడియన్ తో చేయాలనేది బండ్ల ప్లాన్. అయితే
ఈ క్రమంలో చాలామంది బండ్లకు ఓ కీలకమైన సూచన చేశారు. ఎలాగూ నటుడిగా అనుభవం, క్రేజ్ కూడా
ఉంది కాబట్టి.. మండేలా సినిమాలో లీడ్ రోల్ చేయమని సలహా ఇచ్చారు. దీంతో బండ్ల ప్రస్తుతం ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చారు బండ్ల. అయితే అందులో అతడు చేసిన
పాత్రపై విమర్శలు చెలరేగడంతో మళ్లీ నటనకు బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండేలా రీమేక్ ఒక్కటే
బండ్లకు సరైన ఎంట్రీ అని అంతా భావిస్తున్నారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *