యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ | teluguglobal.in

April 27, 2021 0 Comments






బుల్లితెర వీక్షకులకు శ్యామల గురించి పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా ఆమె యమ పాపులర్. ఎన్నో
సినిమా ఫంక్షన్లలో శ్యామల ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇప్పుడీ యాంకర్ మరో కోణంలో వార్తల్లో వ్యక్తిగా
మారింది. శ్యామల భర్త నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఓ మహిళ వద్ద నుంచి 2017లో కోటి రూపాయలు తీసుకున్నారట నరసింహారెడ్డి. అయితే ఎన్నేళ్లు గడిచినా ఆ డబ్బు తిరిగి ఇవ్వడంలేదట. తాజాగా బెదిరింపులకు కూడా దిగారట. పైగా ఈమధ్య లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారట.

దీంతో సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నరసింహారెడ్డిని
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. విషయం తెలిసిన
వెంటనే నరసింహారెడ్డి మరో మహిళను రంగంలోకి దించాడు.

మరో మహిళ ద్వారా మధ్యవర్తిత్వం నడపడానికి ట్రై చేశాడు. అయినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు.
దీంతో నరసింహారెడ్డితో పాటు సెటిల్ మెంట్ కు దిగిన సదరు యువతిని కూడా పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు.






Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *