మేలో మిలియన్ల కేసులు? | teluguglobal.in

April 26, 2021 0 Comments


దేశంలో ఇప్పుడు పరిస్థితి మొదటి వేవ్ కంటే తీవ్రంగా ఉంది. మొదటి వేవ్ కంటే కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఒకపక్క రోగులతో ఆస్పత్రుల్లో పడకలు నిండిపోగా.. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అందుకే ప్రపంచంలో మరే దేశంలోనూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రోజవారీ కేసులు నమోదవుతున్నాయి.. అయితే ఇప్పుడు లక్షల్లో ఉన్న ఈ సంఖ్య మే మధ్య నాటికి పది లక్షలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్ట్, బయో స్టాటిస్టీషియన్ అయిన భ్రమర్ ముఖర్జీ.. భారత్‌లో కరోనా విజృంభణ మే మధ్య నాటికి పది లక్షలకు చేరుతుందని, మరణాలు ఐదు వేలకు చేరే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు.ప్రస్తుతం భారత్‌లో నమోదువుతున్న కేసుల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఈవేల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ఆమె ఈ విశ్లేషిణ చేశారు.

” ప్రభుత్వ లెక్కల్లోకి రానివాటితో కలిపి మొత్తం కేసులు మే మధ్యనాటికి 45 లక్షలకు చేరొచ్చు. ఎక్కడికక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం, భారీ సమూహాలను నిషేధించడం, ఇంటర్నేషనల్ ట్రాన్స్ పోర్ట్ ను నిలిపివేయడం, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించొచ్చు. అలా చేస్తే ఆగష్టు నాటికి కొంతవరకూ కేసులు తగ్గుముఖం పట్టొచ్చు” అని ఆమె అన్నారు.

వైరస్‌ లో జెనెటిక్ మార్పులపై రీసెర్చ్ చేయడంతో పాటు, ప్రజారోగ్య వ్యవస్థను అత్యంత అప్రమత్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని, భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ సమాజ సహకారం అవసరమని, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *