ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్.. సరికొత్త క్యాంపెయిన్..

April 19, 2021 0 Comments


ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ యుగంలో ప్రతీ చిన్నపనికీ ఇంటర్నెట్ కావాల్సిందే.. సామాన్యుల నుంచి ప్రపంచ అధినేతల వరకూ ఇంటర్నెట్ తో ముడిపడని జీవితం లేదు. అయితే ఇలాంటి డిజిటల్ యుగంలో కూడా ఇంటర్నెట్ సౌకర్యానికి నోచుకోని కొన్ని గ్రామాలున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ ను మానవ ప్రాథమిక హక్కుగా మార్చాలని కొన్ని సంస్థలు ‘అన్ మ్యూట్ ది వరల్డ్’ అనే క్యాంపెయిన్ చేస్తున్నాయి.

గ్లోబల్ హెల్త్ సర్వీసెస్ (జీహెచ్ఎస్), వర్ట్.కామ్(virt.com) కలిసి తాజాగా ‘అన్‌మ్యూట్ ది వరల్డ్’ అనే కొత్త క్యాంపెయిన్‌ను మొదలుపెట్టాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రాథమిక మానవ హక్కుగా మార్చడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశమని వాళ్లు చెప్తున్నారు.

సుమారు తొంభై ఏళ్ల క్రితం న్యూయార్క్ నగరంలోని AT & T సంస్థల మధ్య తొలి వీడియో కాల్ నడిచింది. కానీ ఇప్పుడు పిల్లల క్లాసుల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకూ.. అంతా వర్చువల్ వరల్డ్ గా మారిపోయింది. కానీ ఇలాంటి రోజుల్లో కూడా కనీస ఇంటర్నెట్ సదుపాయాలు పొందలేని వాళ్లున్నారు. ప్రస్తుతం సంపన్న దేశాల్లో 87% మంది ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 47% మంది కనెక్ట్ అయ్యారు. తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 19% మంది మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నారు.

అందుకే ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి అవసరమైన విధానాల రూపకల్పన, కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఈ ప్రచారం అనేక రకాల చర్యలను కోరుతుంది. ఈ ప్రచారంలో దాతలు, ఫండర్స్, టెక్ కంపెనీలు, ఈవెంట్ నిర్వాహకులతో పాటు డిజిటల్ వరల్డ్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని క్యాంపెయిన్ నిర్వాహకులు కోరుతున్నారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *