టూరిస్ట్​ స్పాట్లు ‘బంద్​’ | teluguglobal.in

April 16, 2021 0 Comments


దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని పలు చారిత్రక కట్టడాలను కొంతకాలం పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది. ఓ వైపు రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నా.. ప్రజలు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ఇష్టారాజ్యంగా రోడ్లమీద తిరుగుతున్నారు. కరోనా వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

మరోవైపు చిరువ్యాపారులు, వలసకూలీలు బతుకు దెరువు కోసం పనుల కోసం వెళ్లక తప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మరోవైపు చాలా రాష్ట్రాల్లో పబ్బులు, క్లబ్బులు యథాతథంగా కొనసాగుతున్నాయి. టూరిస్ట్​ స్పాట్లకు కూడా ప్రజలు వెళ్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఉన్న పలు చారిత్రక కట్టడాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది.

చారిత్రక కట్టడాలు, స్మారకస్థలాలు, మ్యూజియాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జియోలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా ఓ ప్రకటన జారీచేసింది. మే 15 వరకు మూసివేస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్​ సింగ్​ పటేల్​ ట్వీట్​ చేశారు.

గత ఏడాది కరోనా టైంలోనూ పలు ఆంక్షలను విధించారు. అయితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతో మళ్లీ సడలింపులు ఇచ్చారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నది. దేశంలో రోజుకు సగటున 2 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం అలర్టయ్యింది. అయితే సింహభాగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులను కేటాయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే .. కేంద్రానికి లేఖ రాశారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *