వకీల్ సాబ్ ట్రయిలర్ రివ్యూ | teluguglobal.in

March 29, 2021 0 Comments


పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ ట్రయిలర్ రానే వచ్చింది. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ ట్రయిలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను దున్నేస్తోంది. వకీల్ సాబ్ ట్రయిలర్ చూసి పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది వకీల్ సాబ్. ఆ ఛాయలన్నీ ట్రయిలర్ లో కనిపించాయి. మరీ ముఖ్యంగా సినిమాకు అత్యంత కీలకమైన కోర్టు సీన్ సన్నివేశాలకు ట్రయిలర్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

అయితే వకీల్ సాబ్ లో చాలా మార్పులు జరిగాయి. పవన్ స్టయిల్, క్రేజ్ కు తగ్గట్టు అతడి పాత్ర స్వభావాన్ని మార్చడంతో పాటు 3 ఫైట్స్ కూడా పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. అవేవీ ట్రయిలర్ లో చూపించకుండా జాగ్రత్తపడ్డారు. మరీ ముఖ్యంగా శృతిహాసన్ కూడా ట్రయిలర్ లో కనిపించలేదు.

టెక్నికల్ గా చూస్తే ట్రయిలర్ చాలా రిచ్ గా ఉంది. వినోద్ సినిమాటోగ్రఫీ, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఏప్రిల్ 9న థియేటర్లలోకి వస్తున్నాడు వకీల్ సాబ్.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *