వీరమల్లు వచ్చేశాడు | teluguglobal.in

March 11, 2021 0 Comments


సస్పెన్స్ కు తెరపడింది. సినిమాపై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. పవన్-క్రిష్ కాంబినేషన్ లో
వస్తున్న సినిమాకు సంబంధించి అన్ని అంశాలపై ఈరోజు పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. శివరాత్రి సందర్భంగా
ఈ సినిమాకు సంబంధించి ఒకేసారి ఫస్ట్ లుక్ తో పాటు వీడియో కూడా రిలీజ్ చేశారు.

పవన్-క్రిష్ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో పవన్ లుక్ ఎలా
ఉండబోతోందనే విషయాన్ని చెబుతూనే, ఫైట్ మోడ్ లో ఉన్న పవన్ వీడియోను రిలీజ్ చేశారు.
అంతేకాదు… సినిమా బ్యాక్ డ్రాప్ కూడా బయటపెట్టారు.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, 150 కోట్ల
రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, రెడ్ ఫోర్ట్,
మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు.

ఇప్పటికి 40 శాతం షూటింగ్ పూర్తిచేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తారు. నిధి అగర్వాల్ హీరోయిన్.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *