పని పూర్తిచేసిన సాయితేజ్ | teluguglobal.in

February 23, 2021 0 Comments


హీరో సాయిధరమ్ తేజ్ మరో సినిమా పూర్తిచేశాడు. దేవకట్టా డైరక్షన్ లో చేస్తున్న రిపబ్లిక్ సినిమాను జస్ట్ 4
నెలల్లో పూర్తిచేశాడు ఈ మెగా హీరో. నిన్నటితో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది రిపబ్లిక్ సినిమా. మూవీకి సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్
చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటరైన ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అసలైన ప్రమోషన్
స్టార్ట్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో ముందుగా నివేత పెతురాజ్ ను తీసుకున్నారు. కానీ సెట్స్ పైకి వచ్చేసరికి ఆమె
మారిపోయింది. ఆమె స్థానంలో ఐశ్వర్య రాజేశ్ ను హీరోయిన్ గా తీసుకొని మూవీ కంప్లీట్ చేశారు. భగవాన్,
పుల్లారావ్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయబోతున్నారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *