రేపట్నుంచి మరో సినిమాలో పవన్ | teluguglobal.in

February 21, 2021 0 Comments


టైట్ గా ఉన్న పవన్ సినిమాల జాబితాలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి చేరింది అయ్యప్పనుమ్ కోషియమ్.
దీంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మరింత ఆలస్యమైంది. అలా లేట్ అయిన ఈ సినిమా
ఇప్పుడు మరోసారి సెట్స్ పైకి రాబోతోంది. రేపట్నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షురూ అవుతుంది.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసిన పవన్, రేపట్నుంచి క్రిష్
సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే గండికోట సంస్థాన్ సెట్ రెడీ
అయింది. ఆ సెట్ లోనే రేపట్నుంచి 10 రోజుల పాటు షూటింగ్ జరగబోతోంది. ఆ తర్వాత 17వ
శతాబ్దంనాటి చార్మినార్ సెట్ లో షూటింగ్ ఉంటుంది.

ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు టైటిల్ ను
కూడా రిజిస్టర్ చేయించాడు నిర్మాత ఏఎం రత్నం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు
కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *